మార్కెట్లో ప్రస్తుతం రకరకాల కొత్త ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి ప్రొడక్ట్స్‌ను వాడేందుకు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. కనుకనే కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో తమ ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయి. వాటికి ఆదరణ కూడా పెరుగుతోంది. టెక్నాలజీలో వస్తున్న మార్పుల వల్ల ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వస్తువులను తయారు చేసి ఇవ్వడం చాలా తేలికవుతోంది. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ ప్రొడక్ట్ గురించే. ఇంతకీ అది ఏమిటంటారా.. అదేనండీ.. బౌన్సింగ్ బెడ్. అవును, మీరు విన్నది నిజమే. బహుశా మీరు ఈ పేరును ఇప్పటి వరకు విని ఉండరు.
చైనాకు చెందిన సైమన్స్ గ్రూప్ స్లీప్ టెక్నాలజీ కో. బౌన్సింగ్ బెడ్ పేరిట ఓ ప్రత్యేకమైన బెడ్‌ను రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ బెడ్‌పై మహిళ వెల్లకిలా పడుకుని ఉండగా ఆ బెడ్ కిందకు మీదకు బౌన్స్ అవడాన్ని గమనించవచ్చు. అయితే ఆ బెడ్‌పై ఉండేందుకు ఆ మహిళ కాస్త ఇబ్బంది కూడా పడింది. ఎందుకంటే ఆ బెడ్ శృంగార భంగిమలో పైకి కిందకు ఊగింది మరి. అందుకనే దానిపై ఉండేందుకు ఆ మహిళ కాస్త సిగ్గు పడింది.
ఇక ఆ మహిళ ఆ బెడ్‌పై పడుకుని ఉండగా దాన్ని పక్కనే ఉన్న సేల్స్ మన్ రిమోట్‌తో కంట్రోల్ చేస్తుండడాన్ని గమనించవచ్చు. అయితే ఈ బెడ్‌ను రూపొందించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే.. శృంగారంలో పాల్గొనే కపుల్స్‌కు మరింత సౌకర్యాన్ని, తృప్తిని కలిగించడం కోసం బెడ్‌ను ఇలా తయారు చేశారట. అయితే ఇది ఎక్కడ లభిస్తుంది, ధర ఎంత.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ వీడియో బాగా పాపులర్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.
Chinese invention: The Bouncing Bed – spicing things up for couples!
pic.twitter.com/60ZT7zlIc0— Interesting STEM (@InterestingSTEM) August 24, 2024