ఆన్లైన్లో డబ్బు సంపాదించే మార్గాల్లో యూట్యూబ్ చానల్ కూడా ఒకటి. ఓపిక, శ్రమ, సాంకేతిక పరిజ్ఞానంపై కొద్దిగా అవగాహన. ఉండాలేగానీ ఎవరైనా యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసి చక్కని ఆదాయం పొందవచ్చు. అయితే నెలకు రూ.10 లక్షలు సంపాదించవచ్చా ? అంటే.. చేయవచ్చు.. కానీ అందుకు చాలా కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది. యూట్యూబ్‌లో చానల్ మొదలు పెట్టే ముందు కంటెంట్ ఎంచుకోవాలి. మీకు ఏ రంగంపై పట్టు ఉందో తెలుసుకోవాలి. డాక్టర్లు అయితే వారికి వైద్య రంగం గురించి పూర్తి అవగాహన ఉంటుంది కనుక వారు ఏ టాపిక్ గురించి అయినా అనర్గరళంగా మాట్లాడగలరు. అలాగే టైలరింగ్, వంటలు, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్.. ఇలా భిన్న రకాల కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీడియోల రూపంలో పోస్ట్ చేయవచ్చు. కానీ వాటిల్లో మీకు ఏ రంగంలో పట్టు ఉందో దాన్ని ఎంచుకుని అందులో వీడియోలను రూపొందించాలి. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను పొందవచ్చు. చానల్ వేగంగా పాపులర్ అవుతుంది.
మీకు నచ్చిన టాపిక్‌ను ఎంచుకున్నాక అందులో ట్రెండింగ్ అంశాలను వెదకాలి. ఆ టాపిక్‌లో వ్యూయర్స్ ఏ తరహా వీడియోలను చూస్తున్నారో పరిశీలించాలి. సరిగ్గా అలాంటి వీడియోలను రూపొందించే ప్రయత్నం చేయాలి. మొదట 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యే వరకు కష్టంగా ఉంటుంది. కానీ 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యాక చానల్‌కు వేగంగా సబ్స్క్రైబర్లు వస్తారు. దీంతో తక్కువ కాలంలోనే చానల్ పాపులర్ గా మారుతుంది. యూట్యూబ్‌లో 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే వీడియోలకు యాడ్స్ వస్తాయి. దీంతో ఆదాయం రావడం మొదలవుతుంది. అయితే ఒక వీడియోను ఎంత మంది చూస్తున్నారు, ఆ వీడియో చూసేటప్పుడు ఎన్ని యాడ్స్ వస్తున్నాయి ? అనే అంశాల ఆధారంగా రెవెన్యూ వస్తుంది. అంటే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ సార్లు యాడ్స్ డిస్ప్లే అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఇలా యూట్యూబ్‌లో రెవెన్యూ వస్తుంది.
మనం ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్ ప్రారంభిస్తే దానికి పబ్లిసిటీ ఎలా చేస్తామో, యూట్యూబ్‌లో కూడా పబ్లిసిటీ ముఖ్యం. మీ వద్ద తగినంత బడ్జెట్ ఉందని అనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ ప్లాట్‌ఫామ్‌లతోపాటు గూగుల్ యాడ్స్ ద్వారా కూడా యాడ్స్ ఇవ్వవచ్చు. చానల్ లేదా చానల్ లో అప్లోడ్ చేసే వీడియోలను ప్రమోట్ చేయవచ్చు. ఈ క్రమంలో చానల్‌ను ప్రమోట్ చేస్తే సబ్స్క్రైబర్లు పెరుగుతారు. అదే వీడియోలను ప్రమోట్ చేస్తే వ్యూస్ వస్తాయి. రెండింటినీ ప్రమోట్ చేస్తే రెండూ వస్తాయి. ఇలా చానల్‌కు పబ్లిసిటీ చేయవచ్చు. దీంతో చానల్ త్వరగా వృద్ధిలోకి వస్తుంది. తగినంత బడ్జెట్ పెట్టకపోయినా ఫర్వాలేదు. పబ్లిసిటీ అవసరం లేదు. అనుకుంటే చానల్ పాపులర్ అయ్యేందుకు సమయం పడుతుంది.
ఈ విధంగా యూట్యూబ్‌లో చానల్ క్రియేట్ చేసి ఆదాయం పొందవచ్చు. ఇక నెలకు రూ.10 లక్షలు వస్తాయా ? అంటే.. కఠినంగా శ్రమించాలి. ట్రెండింగ్ అంశాలకు చెందిన టాపిక్‌లను ఎంచుకుని వీడియోలు చేయాలి. దీంతో వ్యూస్ వస్తాయి. ఫలితంగా ఎక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు. బాగా పాపులర్ అవ్వాలే కానీ యూట్యూబ్ చానల్ ద్వారా నెలకు రూ.10 లక్షలు కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువగానే సంపాదించవచ్చు..!