Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chicken Mudda Kura : చికెన్‌ను ఇలా ఎప్పుడైనా ముద్ద ముద్ద‌గా చేశారా.. భ‌లే టేస్టీగా ఉంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

D by D
April 26, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chicken Mudda Kura : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ముద్ద కూర కూడా ఒక‌టి. ఈ కూర నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా క‌మ్మ‌గా, మెత్త‌గా ఉంటుంది. దంతాలు ఊడిపోయిన వారు కూడా ఈ కూర‌ను సుల‌భంగా తిన‌వ‌చ్చు. అలాగే ఈ కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు చికెన్ ముద్ద కూర‌ను తయారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ ముద్ద కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ముద్ద కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – అరకిలో, నీళ్లు – 600 ఎమ్ ఎల్,మిరియాలు – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ముక్క‌, యాల‌కులు – 4, బిర్యానీ ఆకు – 1, ఉప్పు – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్.

Chicken Mudda Kura recipe in telugu how to make this
Chicken Mudda Kura

కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు -2 టేబుల్ స్పూన్స్, కొబ్బ‌రి పొడి – 2 టీ స్పూన్స్, నూనె – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన‌ ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్న‌ర టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ట‌మాట – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

చికెన్ ముద్ద కూర త‌యారీ విధానం..

ముందుగా నీటిలో చికెన్ ను శుభ్రం చేసి వేసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసిచికెన్ ను ఉడికించాలి. ఈ నీళ్లు స‌గం అయ్యే వ‌ర‌కు చికెన్ ను బాగా ఉడికించాలి. చికెన్ ఉడికేట‌ప్పుడు పైన ఏర్ప‌డే తేట‌ను తీసేస్తూ ఉండాలి. ఇలా ఉడికించిన త‌రువాత చికెన్ ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. నీటిలో ఏండే మ‌సాలా దినుసుల‌ను తీసేసి నీటిని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత చికెన్ ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో గ‌స‌గ‌సాలు, నువ్వులు, కొబ్బ‌రి పొడి, నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, కారం, ఉప్పు, ప‌సుపు వేసి వేయించాలి.

త‌రువాత క‌రివేపాకు, ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ ముక్క‌లు వేసి మ‌రో 4 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత చికెన్ ఉడికించిన నీళ్లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ముద్ద కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటి, అట్టు వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Chicken Mudda Kura
Previous Post

Mushroom Tomato Masala Curry : పుట్ట‌గొడుగులు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Next Post

Carom Seeds : రోజూ ఒక్క స్పూన్ చాలు.. కొలెస్ట్రాల్ ఉండ‌దు.. గుండె సేఫ్‌.. బ‌రువు త‌గ్గుతారు..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.