మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యే వార్తల్లో నిలిచారు. ఎక్కువ సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు గాను ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. అయితే తాజాగా మరోసారి ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. చిరు ఒక ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారట. అది ఎక్కడ, ఆ స్థలం రేటు తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని ఊటీకి దగ్గరలో ఒక కొండ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక టీ ఎస్టేట్‌ను కొన్నారట. 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ టీ ఎస్టేట్ ఖరీదు రూ.16 కోట్లట. రామ్‌చరణ్, ఉపాసన దగ్గరుండి రిజిస్ట్రేషన్ పనులు చేయించారట. అలాగే అక్కడ ఒక లగ్జరీ ఫామ్ హౌస్‌ను చిరంజీవి నిర్మించనున్నారట. దీనికి గాను చరణ్, ఉపాసనలు డిజైన్ ఐడియాలు చూస్తున్నారట.
అయితే చిరుకు బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ఇప్పటికే ఒక ఫామ్ హౌస్ ఉంది. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న దేవనహల్లిలో చిరంజీవికి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆయన తరచూ ఈ ఫామ్ హౌస్‌కు వచ్చి సేదతీరుతుంటారు. ఇక ఊటీలోనూ మరొక ఫామ్ హౌస్‌ను నిర్మించనున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కునాల్ కపూర్, అషిక రంగనాథ్, మీనాక్షి చౌదరిలు ఇతర పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.