Sleep : ప్రస్తుత కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఎక్కువుతున్నారు. ధనవంతులు ఇంకా డబ్బు సంపాదించాలన్న వ్యామోహంలో కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి అప్పులు చేసి అభాసు పాలవుతూ ఉన్నారు. ఇక పేదవారు ఇంటి అవసరాల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు చేయడం చాలా సులభమే. కానీ అప్పుల ఊబి నుండి బయటపడడం చాలా కష్టం. ఈ అప్పులను తీర్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు పండితుల వద్దకు వెళ్లి పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండక బాధపడుతుంటారు. ఇలాంటి వారందరూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గనక ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు చేయాల్సిన పరిహారం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ రాత్రి పడుకునే ముందు నేను డబ్బును ఆకర్షిస్తూ ఉన్నాను. డబ్బు నా దగ్గర ఉండడానికి నేను ఆర్హత కలిగి ఉన్నాను. భవిష్యత్తులో నేను కోట్లకు అధిపతిని కాగలను అని 11 సార్లు మనసులో అనుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ధనం వచ్చే మార్గాలు కనిపిస్తాయి. ఎవరికైనా సరే ముందుగా తమ మీద తమకు నమ్మకం ఉండాలి. ఏదైనా సాధిస్తాను అనే పట్టుదల ఉండాలి. అలా నమ్మకం కలిగిన రోజు ఎటువంటి కష్టం వచ్చినా కూడా విజయం సాధిస్తారు.
ఈ విధంగా రోజూ రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనస్సులో అనుకునే ముందు ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడేయాలని ఇష్ట దైవాన్ని కోరుకోవడంతోపాటు మన ప్రయత్నం కూడా మనం చేయాలి. లేదంటే ఏదీ సఫలీకృతం కాదు. రోజూ రాత్రి భగవన్నామస్మరణ చేసి పడుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఇలా రోజూ చేస్తే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.