సాధారణంగా హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏవైనా కలహాలు, సమస్యలు ఏర్పడితే కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే మన ఇంటిలో ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడాలంటే అందుకు ఉప్పు, లవంగాలు చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.
మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఈ కష్టాల నుంచి విముక్తి పొందడం కోసం ఒక గాజు గ్లాసులో కొద్దిగా ఉప్పును, ఒక నాలుగైదు లవంగాలను వేసి మన ఇంట్లో ఒక మూలగా పెట్టాలి.
ఈ విధంగా గాజు గ్లాసులో ఉప్పు, లవంగాలను వేసి పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే మన ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అయితే ఈ ఉప్పు, లవంగాలను ఎవరూ తాకకూడదు. కొద్దిరోజుల తర్వాత వాటిని పడేసి మరోసారి ఉప్పు, లవంగాలను పెట్టడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల సమస్యల నుంచి బయట పడవచ్చు.