సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే జ్యోతిషశాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ఎంతో పుణ్య ఫలం అని భావిస్తారు. అయితే దానధర్మాలను చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దానధర్మాలను ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తరువాత కొన్ని వస్తువులను ఇతరులకు ఎలాంటి పరిస్థితులలో కూడా దానం చేయకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత పెరుగును దానం చేయకూడదు. పెరుగు శుక్రగ్రహానికి ప్రతీక కనుక పెరుగును సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు దానం చేయడం వల్ల మన ఇంట్లో సంతోషం కరువవుతుంది. అలాగే డబ్బులను కూడా అప్పు ఇవ్వకూడదు.
ఉల్లిపాయ, వెల్లుల్లిని సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. ఈ విధంగా దానం చేయడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కొందరు పాలను దానం చేయడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. అయితే సూర్యాస్తమయం తర్వాత పాలను ఎవరికి దానం చేయకూడదు. ఎందుకంటే పాలు సూర్యచంద్రులకు ప్రతీకగా సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉప్పును కూడా సాయంత్రం ఎవరికీ ఇవ్వకూడదు.ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు దానం చేయడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.