సాధారణంగా మన గ్రామాలలో లేదా మన పరిసర ప్రాంతాలలో ఏదైనా కొత్త ఆలయ నిర్మాణం చేపడితే ఆ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున విరాళాలను ప్రకటించడం, లేదా ఆలయానికి కొన్ని వస్తువులను దానం చేయడం మనం చూస్తుంటాము. అయితే ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
ఆలయ గోడలకు సున్నం కొట్టడం, ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆలయం ముందు ముగ్గులు తీర్చిదిద్దడం వంటి పనులు చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆలయానికి శంఖం దానం చేయటం వల్ల మరో జన్మ మానవజన్మ ఎత్తిన ఎంతో కీర్తి మంతుడువుతాడు. గంటను దానం చేయటం వల్ల గొప్ప కీర్తిని పొందుతారు.
ఆలయంలో గజ్జలు లేదా నువ్వులను దానం చేసిన వారికి సౌభాగ్యం కలుగుతుంది.కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. దర్పణం దానం చేయటం వల్ల మంచి రూపం లభిస్తుంది. ఆలయంలోని దేవుడి పరిచర్యలు కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. మరికొందరు స్వామివారి విగ్రహానికి వెండి, బంగారు, ఇతర లోహాలను దానం చేయటం వల్ల వారికి పుణ్య ఫలం లభించడమే కాకుండా, సర్వ కోరికలు తీరుతాయి.