Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dum Ka Murgh : రెస్టారెంట్‌ల‌లో ల‌భించే ధ‌మ్ కా ముర్గ్.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

D by D
February 22, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dum Ka Murgh : మ‌న‌కు రెస్టారెంట్ లలో ల‌భించే చికెన్ వెరైటీలల్లో ధ‌మ్ కా ముర్గ్ ఒక‌టి. చికెన్ తో చేసే పురాత‌న వంట‌కాల్లో ఇది ఒక‌టి. ధ‌మ్ కా ముర్గ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని ఇష్ట‌ప‌డ‌క మాన‌ర‌ని చెప్ప‌వ‌చ్చు. ఇత‌ర చికెన్ వంట‌కాల కంటే దీని త‌యారీ విధానం భిన్నంగా ఉన్న‌ప్ప‌టికి త‌యారు చేయ‌డం మాత్రం చాలా తేలిక‌. ఒక్క‌సారి దీని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదు కావాల‌ని అగ‌డ‌క మాన‌రు. చికెన్ వెరైటీల‌ల్లో ఒక‌టైన ధ‌మ్ కా ముర్గ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధ‌మ్ కా ముర్గ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – 15, సిరోంజి ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, సార ప‌ప్పు – 2 టీ స్పూన్స్, బాదం ప‌ప్పు – 25, ప‌చ్చిమిర్చి – 2, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 4, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, నీళ్లు – 50 ఎమ్ ఎల్, నూనె – 2 టేబుల్ స్పూన్.

Dum Ka Murgh recipe in telugu make in this method
Dum Ka Murgh

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – 500 గ్రా., పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌కాయ – 1, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్. ఫ్రైడ్ ఆనియ‌న్స్ – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.

ధ‌మ్ కా ముర్గ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను శుభ్రంగా క‌డిగి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి ఒక రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. రాత్రంతా మ్యారినేట్ చేసుకునే స‌మ‌యం లేని వారు దీనిని క‌నీసం 3 గంట‌ల పాటైన మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో జీడిప‌ప్పు, సిరోంజి ప‌ప్పు, సార ప‌ప్పు, బాదం పప్పు వేసి చిన్న మంట‌పై 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత ఈ ప‌ప్పుల‌ను జార్ లోకి తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయి అంచుల చుట్టూ ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా పిండిని ఉంచాలి. త‌రువాత చికెన్ లో నూనె వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా గట్టిగా మూత పెట్టాలి. త‌రువాత దీనిని 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై, 5 నిమిషాల పాటు చిన్న మంట‌పై ధ‌మ్ చేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అర‌గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత మూత తీసి మ‌రోసారి క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ధ‌మ్ కా ముర్గ్ త‌యార‌వుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో లేదా స్పెష‌ల్ డేస్ లో చికెన్ తో ఈ విధంగా ధ‌మ్ కా ముర్గ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. త‌ర‌చూ చేసే చికెన్ వంట‌కాల కంటే ఈ విధంగా చేసిన చిక్న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Dum Ka Murgh
Previous Post

Curry Leaves For Hair : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెర‌గ‌డం ఖాయం..!

Next Post

Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!