Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Egg Fry : అచ్చం చికెన్ ఫ్రై లా ఉండే విధంగా ఎగ్ ఫ్రై ని ఇలా చేసుకోవ‌చ్చు..!

D by D
January 10, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Egg Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ ధ‌ర‌లోనే మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉంటాయి. ఈ కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా ఫ్రై చేస్తూ ఉంటాం. కింద చెప్పిన విధంగా చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చూడ‌డానికి చికెన్ ఫ్రై లా ఉంటుంది. అలాగే రుచిగా కూడా ఉంటుంది. దీనిని కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. చూడ‌డానికి చికెన్ ఫ్రై లా ఉండే కోడిగుడ్డు ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Egg Fry recipe in telugu make like chicken fry
Egg Fry

ఎగ్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక రోట్లో వెల్లుల్లి రెబ్బ‌లు, కారం వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత గిన్నెలో కోడిగుడ్ల‌ను వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత‌ క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసి వేడి చేయాలి. దీనిని క‌దిలించ‌కుండా కొద్దిగా వేగే వ‌ర‌కు అలాగే ఉంచాలి. కోడిగుడ్డు ఒక‌వైపు వేగిన‌ త‌రువాత మ‌రో వైపుకు తిప్పి వేయించాలి. కోడిగుడ్డు రెండు వైపులా చ‌క్క‌గా వేగిన త‌రువాత దానిని పెద్ద పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకుని మ‌రికొద్ది సేపు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం వేసి క‌ల‌పాలి.

త‌రువాత ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రై త‌యార‌వుతుంది. ఈ ఎగ్ ఫ్రై చికెన్ ఫ్రై కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా కోడిగుడ్ల‌తో ప‌ది నిమిషాల్లోనే ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అన్నంతో క‌లిపి తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది.

Tags: Egg Fry
Previous Post

Children Health : మీ పిల్ల‌ల ఎముక‌లు బ‌లంగా మారి శారీర‌కంగా దృఢంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..

Next Post

Minapa Pottu Vadiyalu : మిన‌ప పొట్టుతో వ‌డియాల‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.