సాధారణంగా మనం తరచుగా వెళ్లే ఆలయాలలో శివాలయం ఒకటి. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారి లింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలు ఏమిటో స్వామి వారిని ఏ విధంగా నమస్కరించాలో ఇక్కడ తెలుసుకుందాం.
గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకునే సమయంలో మన మనసును ఆ భగవంతుని పై కేంద్రీకరించాలి.అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకునే టప్పుడు స్వామివారి వాహనమైన నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి నంది దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. శివలింగం నందీశ్వరుడు దర్శనం తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఇతర విగ్రహం మూర్తులను దర్శనం చేసుకున్న అప్పుడే సంపూర్ణ దర్శనమవుతుంది.
శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకుంటున్నప్పుడు నంది పృష్ట భాగాన్ని నిమురుతూ, కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా మనపై కలిగి మన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా మన కోరికలను నందీశ్వరుడి చెవిలో చెప్పేటప్పుడు మన కుడిచేతిని నంది చెవికి అడ్డుగా పెట్టి మెల్లిగా మన గోత్రం పేరు మన కోరిక తెలియచెప్పాలి.ఆ తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నందీశ్వరుని పాదాల దగ్గర పెట్టి పూజించాలి. ఈ విధంగా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని దర్శించుకునే సమయంలో ఈ నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేశారు.