Guthi Vankaya Curry : వంకాయలను చూస్తేనే మనకు సహజంగానే నోట్లో నీళ్లూరతాయి. ఎందుకంటే వంకాయలతో వండే ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది. వంకాయను ఇతర కూరగాయలతో కలిపి కూడా వండుకోవచ్చు. ఇక గుత్తి వంకాయలు అయితే వాటితో మసాలా కూర చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా గుత్తి వంకాయలు – అర కిలో, ఆవాలు – అర టీస్పూన్, ఉప్పు – రెండు టీస్పూన్లు, అల్లం – రెండు ముక్కలు, నూనె – రెండు టీస్పూన్లు, పచ్చి మిర్చి – పది.

గుత్తి వంకాయ కూరను తయారు చేసే విధానం..
ఉప్పు, పచ్చి మిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. లేత వంకాయలను చివర్లు విడిపోకుండా నాలుగు భాగాలుగా కోసి వాటిలో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె, ఆవాలు వేసి వేయించుకోవాలి. అందులో గుత్తి వంకాయలను వేసి వేయించుకోవాలి. ముక్కలు బాగా మగ్గిన తరువాత దంచిన కారం వేసి కలియబెట్టాలి. అది బాగా వేగిన తరువాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి. దీంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.