Srivari Nijaroopa Darshanam : ప్రతి రోజు వేలల్లో భక్తులు తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వారి కోరికలని వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుంటూ ఉంటారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం తెల్లవారుజామున రెండవ అర్చన తర్వాత, మూలమూర్తి ఏ అలంకారం లేకుండా దర్శనం ఇస్తారు. దీని గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు తెలుసుకుందాము.
నిజరూప దర్శనం అంటే ఏంటి..? గురువారం నాడు నిజరూప దర్శనం గురించి ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం.. గురువారం నాడు శ్రీవారి నేత్రాలని దర్శించుకునే మహా భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాలకి బదులుగా పట్టు ధో వతిని వేస్తారు. కిరీటాన్ని తీసేస్తారు. వస్త్రాన్ని తలపాగాలా చుడతారు. పెద్దగా ఉండే పచ్చ కర్పూర నామాన్ని కూడా బాగా తగ్గించేస్తారు.
గురువారం నాడు ఈ దర్శనాన్ని నేత్ర దర్శనం అని కూడా పిలుస్తారు. ఇలా గురువారం నాడు నిజరూప దర్శనం ఈ విధంగా ఉంటుంది. చాలా మంది ఈ దర్శనానికి వెళ్లాలని ఎంతగానో ఎదురు చూస్తారు. అందరికీ ఈ మహాభాగ్యం కలగదు. తిరుమల ఆలయ సిబ్బంది ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటారు. ఎలాంటి తప్పు చేయకూడదని భగవత్ సన్నిధిలో పొరపాట్లు జరగకూడదని భావిస్తారు.