Ganga Jalam : హిందువులు గంగాజలాన్ని ఎంతో పవిత్రమైన జలంగా భావిస్తారు. ఈ క్రమంలోనే గంగానదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తుంటారు. అలాగే గంగాజలం ఇంటిలో ఉంచుకోవడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయని భావిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. మరి గంగాజలం ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందామా.
గంగా జలాన్ని మన ఇంట్లో పెట్టినప్పుడు పొరపాటున కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. గంగాజలాన్ని ఎల్లప్పుడూ రాగి, కంచు, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రల్లో మాత్రమే నిల్వ చేసి పెట్టాలి. గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు కనుక ఎల్లప్పుడూ ఎంతో పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. చీకటి పడే చోట గంగాజలాన్ని ఉంచకూడదు. అలాగే గంగా జలాన్ని తాకేటప్పుడు శుభ్రంగా స్నానం చేసిన తరువాత మాత్రమే గంగాజలం తాకాలి.
ఎంతో పవిత్రమైన ఈ గంగాజలాన్ని ఇంటి నలుమూలల చల్లటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దుష్టశక్తులు, నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు గంగా జలాన్ని ఒక ఇత్తడి పాత్రలో నింపి ఇంటికి ఉత్తరం వైపు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎంతో పవిత్రమైన ఈ గంగాజలంతో శివుడికి అభిషేకం చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.