కంప్యూటర్ కీబోర్డుల మీద కొందరు వేగంగా టైప్ చేస్తారు. కొందరు నెమ్మదిగా టైప్ చేస్తారు. కొందరు తమ మాతృభాషలో వేగంగా టైప్ చేస్తారు. అయితే ఎక్కడికి వెళ్లినా సరే కంప్యూటర్ కీ బోర్డులపై ఆంగ్ల అక్షరాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండవు. అంటే ఎ, బి, సి, డి.. ఇలా అక్షర క్రమంలో ఉండవు. ఒక చోట అక్షరం ఉంటే ఇంకో చోట దాని సీక్వెన్స్ ఉంటుంది. మరి ఇలా కీబోర్డు మీద అక్షరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కాకుండా భిన్నంగా ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం కంప్యూటర్ల కోసం వాడుతున్న కీబోర్డు డిజైన్ ఇప్పటిది కాదు. 1870లలో క్రిస్టొఫర్ షోల్స్ అనే వ్యక్తి ఎంతో ఓపిగ్గా తయారు చేసిన డిజైన్ ఇది. ఇప్పుడు మనం వాడుతున్న కీబోర్డు డిజైన్‌ను క్వర్టీ (QWERTY) డిజైన్ అంటారు.
అప్పట్లో టైప్ రైటర్ల మీద కీబోర్డు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లోనే ఉండేది. కానీ కొందరు దాంతో సులభంగా టైప్ చేయడం నేర్చుకున్నారు. ఈ క్రమంలో టైప్ రైటర్లో కీస్ జామ్ అయిపోయేవి. ఇలా సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో కొంత వేగాన్ని తగ్గించేందుకు, సులభంగా టైప్ చేసేందుకు గాను కీబోర్డు డిజైన్ సరిగ్గా ఉండాలని క్రిస్టొఫర్ భావించాడు. అందుకనే అతను కొన్ని వందల డిజైన్లను ట్రై చేశాడు. చివరకు ఇప్పుడు మనం వాడుతున్న క్వర్టీ డిజైన్‌ను రూపొందించాడు. అలా కీబోర్డులపై క్వర్టీ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్‌తో సులభంగా టైప్ చేయవచ్చని తరువాత గుర్తించారు.