Old Items : చాలామంది ఇంట్లో పాత వాటిని, పాత వస్తువులని పారేయకుండా ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అవి ఇంట్లో ఉండడం ప్రమాదం. చాలా మంది ఎక్కువగా పాత న్యూస్ పేపర్లను ఇంట్లో ఉంచుతూ ఉంటారు. పాత న్యూస్ పేపర్ లని గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నా కూడా అలానే ఉంచేస్తారు. దాని వలన దుమ్ము, ధూళి ఎక్కువగా వస్తుంది. పైగా ఇటువంటి వాటిని ఎక్కువ ఉంచుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. మంచిది కూడా కాదు.
ఇంట్లో పనికిరాని, పాత తాళాలని కూడా ఉంచుకోకూడదు. ఉపయోగం లేని తాళాలని ఇంట్లో నుండి తొలగించాలి. లేకపోతే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి అటువంటి వాటిని తొలగించుకోవాలి. లేక పోతే అదృష్టమంతా కూడా పోతుంది. దురదృష్టం, చెడు మాత్రమే కలుగుతాయి. గడియారాలని కూడా పాడైపోయినట్లయితే ఇంట్లో పెట్టకండి.
పాడైపోయినవి, పని చేయని గడియారాలు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. పని చేయని గడియారాలని అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దు. చాలా మంది కొత్త చెప్పుల్ని తెగ కొనేస్తూ ఉంటారు. పాతవి, తెగిపోయినవి ఇంట్లోనే ఉంచేస్తారు. దాని వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వాటిని ఇంట్లో ఉంచకండి, పాత చెప్పులు, బూట్లని శనివారం నాడు బయట పడేస్తే మంచిది.
అలానే పాత బట్టల్ని కూడా చాలా మంది ఇంట్లో ఉంచుతూ ఉంటారు. వాటి వలన నష్టాలు కలుగుతాయి. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే విఘ్నాలు కలగవచ్చు. కాబట్టి అటువంటి బట్టల్ని కూడా ఇంటి నుండి తొలగించడం మంచిది. ఇలా ఇటువంటివి లేకుండా మీరు తొలగించుకుంటే అదృష్టం కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇక అంతా మంచే జరుగుతుంది.