నేటి డిజిటల్ ప్రపంచంలో, స్మార్ట్ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి, దీని ద్వారా మీ అనేక పనులు సులభంగా మారాయి, ముఖ్యంగా, డబ్బు లావాదేవీలు సులభంగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కేవలం మీ వేలిముద్రల వద్ద ఎవరికైనా డబ్బు పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు. అయితే హ్యాకర్లు, మోసగాళ్ల కారణంగా, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత డేటా పరంగా ఓ ఫీచర్ కొన్నిసార్లు వినియోగదారులకు ప్రమాదకరం . యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని పొందడానికి చాలా మంది తరచుగా యూపీఐ యాప్‌లను ఆశ్రయిస్తారు. యూపీఐ ఒక మోడ్‌ని ఆన్ చేయడం వలన మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో పడుతుందని మీకు తెలుసా?
యూపీఐని ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తారు, రీఛార్జ్ చేస్తారు,ఓటీటీ యాప్‌లను రీఛార్జ్ చేస్తారు, ఇతర యాప్‌లకు సబ్స్క్రయిబ్ చేస్తాము. అటువంటి చెల్లింపు ప్రతి నెలా చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండటానికి యూపీఐ ఆటోపే మోడ్‌ను ఉపయోగించాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు యూపీఐ ఆటోపే మోడ్ కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.ఇది వినియోగదారులను ఆటోమేటిక్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. దీని కోసం వినియోగదారులు యూపీఐ పిన్ను నమోదు చేయవలసిన అవసరం లేదు. ఒకసారి యూపీఐ పిన్ నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ని నమోదు చేయకుండానే భవిష్యత్తులో సులభంగా చెల్లింపు చేయవచ్చు.
మీరు నెలవారీ చెల్లింపు చేసే ఓటీటీ యాప్‌ల కోసం లేదా పేమెంట్ చేయని వాటి కోసం ఆటోపే మోడ్‌ను ఆన్‌లో ఉంచినట్లయితే కొన్నిసార్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బు ఆటోమేటిక్‌గా ఓయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కోన్ని సర్వీస్ కోసం ఆటోపే మోడ్‌ను ఆన్ చేయాలి. కొన్నిసార్లు మనం ఉపయోగించని వాటి కోసం ఆ మోడ్ ఆఫ్ చేయాలి. లేదంలో మీ ఖాతా నుంచి డబ్బులు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆటోపే మోడ్‌ని ఎలా డిసేబుల్ చేయాలి . ముందుగా Google Pay లేదా PhonePe ప్రొఫైల్‌కి వెళ్లండి. ఇక్కడ చెల్లింపు మోడ్‌లో మీకు ఆటోపే చూపిస్తుంది. పాజ్, డిలీట్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. పాజ్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు చెల్లింపు మోడ్‌ను ఆపివేయాలి. ఇలా చేయడం వలన మీ ఆర్ధిక పరిస్థితిని కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు.