ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినటువంటి ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటివాటి ద్వారా అధిక మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్ల కారణంగా డబ్బులు సరైన ఖాతాల్లో కాకుండా వేరే ఖాతాలలో పడటం జరుగుతుంటాయి.
ఈ విధంగా డబ్బులు ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కు వెళితే కొందరు ఆ డబ్బులను రిటర్న్ చేయడానికి ఒప్పుకోరు. మరి కొందరు మన డబ్బులను మనకు రిటర్న్ చేయడానికి అంగీకరిస్తారు. ఈ క్రమంలోనే పొరపాటున ఈ విధమైన తప్పిదాలు జరిగి డబ్బులు ఒక ఖాతా కాకుండా మరొక ఖాతాలో పడినట్లయితే బాధితులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని సదరు బ్యాంక్ మేనేజర్ కు తెలియజేయాలి.
బాధితులు బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి ఈ విషయం గురించి ఫిర్యాదు చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకు మేనేజర్ కు అందించాల్సి ఉంటుంది. ఇలా ఫిర్యాదు చేసినప్పుడే తిరిగి మన డబ్బులు మన అకౌంట్ కు వస్తాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా డబ్బులు వేరొకరి ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.