కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకి జన్మనిచ్చిన అడపాదడపా ఏదో ఒక సినిమాతో సందడి చేస్తుంది. అయితే గతంలో కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ టాప్ హీరోలు అందరితో కలిసి పని చేసింది. మెగా ఫ్యామిలీ హీరోలు అందరిని చుట్టేసింది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాప్ స్టార్స్ గా సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్ తో కలిసి మగధీర మూవీలో నటించిన ఈ అందాల చందమామ ఆ తర్వాత నాయక్, గోవిందుడు అందరివాడేలే లాంటి చిత్రాల్లో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే మరోవైపు చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో జతకట్టిన కాజల్.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసింది.
అయితే చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ ఆచార్య చిత్రంలో కూడా నటించింది. కాని ఎందుకో ఆమె సీన్స్ తీసేశారు. అయితే కాజల్‌ని ఖైదీ నెంబర్ 150 సినిమాలో తీసుకుందామని వినాయక్.. చిరంజీవికి చెప్పగా ఆయన భయపడ్డాడట. కాజల్ కన్నా అనుష్క బాగుంటుంది కదా అని అన్నారట. కాని వినాయక్ మాత్రం కాజల్‌ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నట్టు చెప్పాడట. అయితే కాజల్‌తో అంటే చిరంజీవికి లోలోపల చాలా భయం ఏర్పడింది. అందుకు కారణః ఆమె తన కొడుకు అయిన రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే, మగధీర,నాయక్ వంటి సినిమాల్లో చేశారు. అయితే వారిద్దరి మధ్య రొమాన్స్ చాలా బాగుంది. వారిద్దరి జోడి చూడచక్కగా ఉంది. చరణ్‌తో చేసిన అమ్మాయి చిరంజీవితో అంటే ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారా అని డైరెక్టర్‌తో అన్నారట.
వినాయక్ మాత్రం ఆమెనే బాగుంటుందని చెప్పడంతో చిరంజీవి లోలోపల భయపడుతూనే ఉన్నాడట. ఇక కొద్ది రోజులకి చిరంజీవి కాజల్ కి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయ్యాక ఇది చూసిన సురేఖ ఇదేంటి ఆ హీరోయిన్ తో చరణ్ ఎప్పుడు చేశాడు అంటూ ఆశ్చర్యపోయిందట. పూర్తిగా చూసి ఓహో అది మీరేనా అని చిరంజీవితో అనడంతో చిరు కాస్త కూల్ అయ్యాడట. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అర్ధం కావడం లేదని, సినిమా హిట్ అవుతుందని చిరు అనుకున్నారట. ఈ విషయాలని చిరు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.