Kangana Ranaut : జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ మరోమారు వార్తల్లో నిలిచింది. దీపికా పదుకొనె నటించిన గెహ్రాయియా చిత్రంపై ఆమె వివాదాస్పద కామెంట్లు చేసింది. ఆ సినిమా ఒక చెత్త సినిమా అని కంగనా కామెంట్ చేసింది. తాను ఒక వ్యక్తినే అని, ఈ సినిమాలో చూపించిన రొమాన్స్ ఏంటో తనకు తెలుసని కంగనా పేర్కొంది. అయితే ఇలాంటి చెత్త సినిమాలను మాత్రం అసలు ఎంకరేజ్ చేయకూడదని కంగనా కామెంట్లు చేసింది. ఈ క్రమంలోనే కంగనా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గెహ్రాయియా సినిమాలో దీపికా పదుకొనెతోపాటు మరో హీరోయిన్ అనన్య పాండే కూడా నటించింది. ఈ మూవీకి సంబంధించి గతంలో విడుదలైన టీజర్, ట్రైలర్‌లలో దీపికా ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది. దీంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఇక గెహ్రాయియా మూవీని కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా తీశారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున దీపికాను విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇందులో దీపికా గ్లామర్ షోను చూసి ప్రేక్షకులు షాక్ తిన్నారు. అయితే కంగనా ఈ సినిమాపై చేసిన కామెంట్ల గురించి దీపికా స్పందించాల్సి ఉంది.