సమంత, నాగచైతన్య.. ఈ జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీళ్లిద్దరూ ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు కానీ వీరి విడాకులు మాత్రం అందరినీ షాక్‌కు గురి చేశాయి. అయితే అది గతం. ఇప్పుడు ఎవరి జీవితం వారిది. ఓ వైపు సినిమాలతో సమంత బిజీగా ఉంటే మరోవైపు చైతూ ఇంకో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ మధ్యే ఆయన శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ జరుపుకోగా త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారు. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడంపై ఈ మధ్యే ఓ దుమారం రేగిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, చైతన్య విడిపోయారని చాలా మంది కామెంట్లు చేశారు. కానీ అది నిజమా, కాదా అన్న విషయం తెలియలేదు. అయితే ఇదే విషయంపై తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినీ ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చుసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు.. అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా ఈ కామెంట్స్‌పై కేటీఆర్ స్పందించాల్సి ఉంది.