Kothimeera Karam : మనం కొత్తిమీరను సహజంగానే రోజూ అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. దీన్ని చాలా మంది తినకుండానే ఏరి పారేస్తుంటారు. కానీ కొత్తిమీరతో మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొత్తిమీరతో కారం తయారు చేసి రోజూ అన్నంలో మొదటి ముద్దతో తింటే.. అనేక లాభాలు కలుగుతాయి. ఇక కొత్తిమీర కారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర తురుము – నాలుగు కప్పులు, పచ్చి శనగ పప్పు – రెండు టేబుల్ స్పూన్లు, మినప పప్పు – నాలుగు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – పది, వెల్లుల్లిపాయలు – నాలుగు, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – రెండు టీస్పూన్లు.
కొత్తిమీర కారం తయారు చేసే విధానం..
కొత్తిమీరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఆరనివ్వాలి. తరువాత బాణలిలో వేసి వేయించి తీయాలి. ఇప్పుడు పప్పులు, ఎండు మిర్చి, వెల్లుల్లి వేసి వేయించి తీయాలి. చల్లారాక వీటన్నింటికీ చింత పండు, ఉప్పు చేర్చి మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. అంతే.. కొత్తిమీర కారం తయారవుతుంది. దీన్ని రోజూ అన్నంలో మొదటి ముద్దలో తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.