Lava X2 : మొబైల్స్ తయారీదారు లావా.. ఎక్స్2 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను అమర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. 32 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.
లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. అలాగే వెనుకవైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.
లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. దీన్ని లావా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ముందుగా కొనుగోలు చేసిన వారికి ఈ ఫోన్‌పై రూ.400 డిస్కౌంట్ లభిస్తుంది. అందువల్ల ఈ ఫోన్‌ను లాంచింగ్ ఆఫర్ కింద రూ.6599 ధరకు కొనుగోలు చేయవచ్చు.