Legs Towards Doors : నిత్యం అనేక ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతమయ్యే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి, ఆ మాట కొస్తే ప్రతి మనిషికి నిద్ర అవసరమే. నిద్ర పోవడం వల్ల మన శరీరం రిలాక్స్ అవుతుంది. మళ్లీ లేచే సరికి ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్గా పనిచేయవచ్చు. ఇదే కాదు, నిద్రతో మనకు ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. అయితే నిద్ర గురించి చెప్పాల్సిన విషయం ఇంకొకటుంది. అదేమిటంటే..
సాధారణంగా ఎవరైనా నిద్ర పోయే సమయంలో గదిలో ఏదో ఒక వైపు తలను పెట్టి నిద్రిస్తారు. అది దిక్కుల ప్రకారం చెప్పాల్సివస్తే అలా చెబుతారు. ఫలానా దిక్కు మంచిదని, ఇంకో దిక్కు మంచిది కాదని చెబుతుంటారు. అయితే తల కాకుండా నిద్రించే సమయంలో కాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలట. అంటే కాళ్లను తలుపులు ఉన్నవైపు కాకుండా వేరే ఏ వైపుకైనా పెట్టి నిద్రించాలట. అలా చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
తలుపులు ఉన్న వైపు కాళ్లను పెట్టి నిద్రించడం వల్ల మన ఒంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దీంతో ఆ రోజంతా మనకు విశ్రాంతి ఉండదట. తీవ్రమైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళన కలుగుతాయట. అంతేకాదు చనిపోయిన వారి మృతదేహాలను గది నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు ముందుగా కాళ్లను బయట ఉంచుతారు కదా, అందుకే ఆ వైపే మనం కూడా కాళ్లను పెట్టి నిద్రిస్తే దెయ్యాలను ఆహ్వానించినట్టు అవుతుందట. ఇది అస్సలు మంచిది కాదట. కాబట్టి తలుపులు ఉన్న వైపు కాళ్లను పెట్టి నిద్రించకూడదట. వేరే ఏ దిక్కుకైనా కాళ్లను పెట్టి నిద్రిస్తే మంచిది. దీంతో ఎలాంటి అశుభాలు జరగకుండా ఉంటాయి.