ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో బహ్రైచ్ ప్రదేశంలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో జరిగింది. ముస్లింలకు చెందిన ఒక ఇంటి పై కప్పు పై కాషాయ జెండాను గోపాల్ మిశ్రా ఏర్పాటు చేశాడు.
గోపాల్ మిశ్రా ఆ ఇంటి ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఆ ఇంటి పై ఉన్నటువంటి ఆకుపచ్చ జెండాను చింపి అక్కడ కాషాయ జెండాను ఏర్పాటు చేశాడు. ఇలా చేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు చప్పట్లు కొట్టి గోపాల్ మిశ్రాను అభినందించారు.
అయితే ఈ సంఘటన జరిగిన తరువాత అక్టోబర్ 13 ఆదివారం సాయంత్రం మహారాజ్ గంజ్ ప్రాంతంలో దుర్గాదేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో గోపాల్ మిశ్రా ను కాల్చి చంపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న జనాలు అందరూ చాలా భయపడ్డారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజెన్స్ కూడా షాక్ అవుతున్నారు.