Manchu Lakshmi : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఎంతో మంది మహిళా సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా తన జీవితంలోని పలు విశేషాలను తెలియజేశారు. తాను ఒక ప్రముఖ నటుడి కుమార్తెను అయినప్పటికీ.. కెరీర్ తొలి రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తనపై ఎంతో మంది ట్రోల్స్ చేస్తుంటారని.. బాడీ షేమింగ్ కూడా చేస్తారని.. ఆవేదన వ్యక్తం చేసింది.
క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని.. అన్ని చోట్లా ఉందని.. మంచు లక్ష్మి తెలియజేసింది. బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారని చెప్పింది. అయితే తనపై ఎన్ని ట్రోల్స్, విమర్శలు చేసినా.. తనను బాడీ షేమింగ్ చేసినా.. తాను పట్టించుకోనని.. ప్రతి మహిళ ఇలాగే ఉండాలని.. తన పని తాను చేసుకుపోవాలని హితవు పలికింది.
ఇక జీవితం చాలా చిన్నదన్న మంచు లక్ష్మి మనం అనుకున్న పనులను చేసేయాలని చెప్పుకొచ్చింది. అలాగే కోరుకున్నవి సాధించుకోవాలని, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలని తెలిపింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదని, కనుక ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని చెప్పింది. కాగా మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ సంచలనం సృష్టిస్తూ వైరల్గా మారాయి. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం మళయాళంలో మోహన్ లాల్ సినిమా మాన్స్టర్లో నటిస్తోంది. మరో తమిళ సినిమాలో ఈమె పోలీస్ గెటప్ వేయనుంది.