Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన తండ్రి మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈమె మాట్లాడిన మాటలకు ఈమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈమె మళ్లీ వార్తల్లో నిలిచింది. తాను ఒక కొత్త విద్యను నేర్చుకుంటోంది. ఈ సందర్బంగా ఆ విద్య గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది.

కలరి పట్టు విద్య గురించి చాలా మందికి తెలుసు. కేరళ సంప్రదాయ పోరాట విద్య ఇది. దీనిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అందుకనే చాలా మందికి ఈ విద్య గురించి అవగాహన ఏర్పడింది. అయితే మంచు లక్ష్మీ కూడా ప్రస్తుతం ఇదే విద్యను నేర్చుకుంటోంది. అందులో భాగంగానే ఆమె విద్య నేర్చుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె ఒక కామెంట్‌ను కూడా జత చేసింది.
కలరి పట్టు విద్యలో గజ వటివు ఒక భాగం అని.. వటివు అంటే తమిళంలో ఏనుగు అని అర్థం వస్తుందని మంచు లక్ష్మి తెలిపింది. ఇది కలరిలో ఒక రకమైన భంగిమ అని.. దీన్ని వేయడం వల్ల కోపం తగ్గి మనలోని శక్తి రెట్టింపు అవుతుందని.. మనపై మనకు నియంత్రణ వస్తుందని తెలియజేసింది. అందుకనే ఈ విద్యను నేర్చుకుంటున్నానని ఈమె వెల్లడించింది.
ఇక మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. ఈమె ప్రస్తుతం పలు ఇతర భాషల సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. తమిళంలో ఓ సినిమాలో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మళయాళంలో మోహన్ లాల్ సినిమాలో నటించింది. అలాగే పలు టీవీ షోలతో ఈమె బిజీగా ఉంది. ఇక ఈమె చివరిగా పిట్టకథలు, వివాహ భోజనంబు అనే సిరీస్‌లలో కనిపించి అలరించింది.