Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Masala Vadalu : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద అమ్మే మ‌సాలా వ‌డ‌ల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

D by D
January 19, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Masala Vadalu : మ‌నం సాయంత్రం పూట ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద అనేక ర‌కాల చిరుతిళ్లు ల‌భిస్తూ ఉంటాయి. వాటిల్లో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వ‌డ‌ల‌ను ఇష్టంగా తింటారు. బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ వ‌డ‌ల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఎవ‌రైనా వీటిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, చ‌క్క‌గా మ‌సాలా వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌ప‌ప్పు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, స‌న్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ట్ట ( చిన్న‌ది), త‌రిగిన పుదీనా – ఒక క‌ట్ట ( చిన్న‌ది), త‌రిగిన క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Masala Vadalu recipe in telugu easy to make tastes better
Masala Vadalu

మ‌సాలా వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి శ‌న‌గ‌ప‌ప్పును మూడు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. శ‌న‌గ‌ప‌ప్పు చ‌క్క‌గా నానిన త‌రువాత వాటిని పూర్తిగా నీళ్లు లేకుండా నాన‌బెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ శ‌న‌గ‌పప్పులో గుప్పెడు శ‌న‌గ‌పప్పును తీసుకుని ప‌క్క‌కు పెట్టుకుని మిగిలిన శ‌న‌గ‌ప‌ప్పును జార్ లోకి తీసుకోవాలి. ఈ శ‌న‌గ‌పప్పును మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో ప‌క్క‌కు పెట్టుకున్న శ‌న‌గ‌ప‌ప్పును వేసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండ‌లుగా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్, ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Masala Vadalu
Previous Post

Fat : రోజూ ఇలా చేయండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం ఆవిరిలా క‌రిగిపోతుంది..

Next Post

Bread Pakoda : బ్రెడ్‌తో కూడా ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Related Posts

technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025
హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.