Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Menthikura Ullikaram Iguru : మెంతికూర ఉల్లికారం ఇగురు ఇలా చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
September 9, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Menthikura Ullikaram Iguru : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర‌లో అనేక ప్ర‌యోజ‌నాలు,పోషకాలు దాగి ఉన్నాయి. మెంతికూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మెంతికూర‌తో కూడా మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మెంతికూర ఉల్లికారం ఇగురు కూడా ఒక‌టి. ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. మెంతికూర‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ విధంగా త‌యారు చేసిన ఇగురును ఇష్టంగా తింటారు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే మెంతికూర‌తో మెంతికూర ఉల్లికారం ఇగురును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతికూర ఉల్లికారం ఇగురు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

మెంతికూర క‌ట్ట‌లు – 4, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 10, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, త‌రిగిన ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 3, ప‌సుపు – పావు టీ స్పూన్.

Menthikura Ullikaram Iguru recipe in telugu very tasty with rice
Menthikura Ullikaram Iguru

మెంతికూర ఉల్లికారం ఇగురు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత మెంతికూర వేసి వేయించాలి. మెంతికూర పూర్తిగా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి. ట‌మాట ముక్క‌లు పూర్తిగా వేగి నూనె పైకి తేలిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర ఉల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Menthikura Ullikaram Iguru
Previous Post

Aloo Paneer Curry : ఆలు ప‌నీర్ క‌ర్రీ.. ఇలా చేయండి.. రైస్‌, రోటీ. పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

Next Post

Plaque In Arteries : వీటిని తీసుకుంటే చాలు.. బీపీ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది.. ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ అస‌లే ఉండ‌దు..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.