Mirror In Bedroom : ఓ ఆఫీస్ లో ఓ పెద్ద అద్దం ఉంది. దానిలో ఎవరు చూసుకుంటే వారి రూపం ప్రతిబింబిస్తుంది. ఆ అద్దం పక్కనే ఇలా రాసి ఉంది. ఈ ప్రపంచంలో ఎదుగుదలకు సంబంధించిన లక్ష్యాలు, నిర్దేశించుకునే శక్తి సామర్థ్యాలు మీకు మాత్రమే ఉన్నాయి. మీ సంతోషం, మీ విజయం వీటన్నింటిని ప్రభావితం చేసేది మీరు ఒక్కరే. మీ జీవితంలో ఉండే వ్యక్తులు మారవచ్చు కానీ మీ జీవితం మారదు. మీరు మారినప్పుడు మాత్రమే మీజీవితం మారుతుంది. నా శక్తి సామర్థ్యాలు ఇంతే అన్నా ఆలోచనని అధిగమించండి. చూడండి. మీ జీవితానికి మీరే బాధ్యత అని అర్థం అవుతుంది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే దానికి అనుగుణంగా మీరు మారితే మీ జీవితం మారిపోతుంది.
ఎంత గొప్ప సత్యం. అద్దాన్ని అడ్డుగా పెట్టి ఎంత గొప్ప నిజాన్ని చెప్పారు. ఈ విషయాన్ని పక్కన పెడితే మన ఇంట్లో అద్దం ఎక్కడ పడితే మన జీవితం మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇంటి నిర్మాణంలో మనం వాస్తును పాటిస్తాం. కానీ కేవలం ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటిరియర్ డిజైన్ లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూలత శక్తులు ఉండేలా చూసుకోవచ్చని అంటున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా మనం మన పడక గదిని శుభ్రంగా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్దంగా ఉండాలి. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే బెడ్ రూమ్ లో అద్దం అమర్చుకునే విషయంలో జాగ్రత్త వహించాలి.
ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అలాగే అవే వస్తువులు పెట్టకూడని చోట పెడితే అవి ఇంట్లో ప్రతికూల శక్తులను విడుదల చేస్తాయని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా పడక గదిలో అద్దం అమర్చడం మంచిది కాదని వారు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈ అద్దం కనుక బెడ్ ను ప్రతిబించించే విధంగా ఉంటే అస్సలు మంచిది కాదని వారంటున్నారు. దాని వల్ల నిద్రలేమి వంటి సమస్యలతో సతమతమవుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
మూడో వ్యక్తి జోక్యంతో వైవాహిక జీవితం అస్థవ్యస్థంగా మారే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అద్దాన్ని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు. అలాగే పడకగదిలో టీవీని పెట్టుకోవడం మంచిది కాదట. ఇది కూడా అద్దంలాగే ప్రతికూల వస్తువు. కనుక పడకగదిలో బెడ్ ను ప్రతిబింబించేటట్టుగా ఉండే అద్దాన్ని తొలగించి వేరే స్థానంలోకి మార్చాలి లేదా అద్దం పై ఒక తెరను వేయాలి. ఈ చిట్కాను పాటించి వైవాహిక జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.