Mixed Vegetable Pakoda : మనం స్నాక్స్ గా తీసుకునే వాటిలో పకోడాలు కూడా ఒకటి. పకోడాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా ఆనియన్ పకోడా, పాలక్ పకోడా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం మిక్డ్స్ వెజ పకోడాలను కూడా తయారు చేసుకోవచ్చు. వివిధ రకాల కూరగాయలు కలిపి చేసే ఈ పకోడాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. కూరగాయలు తినని పిల్లలకు అదే కూరగాయలతో ఇలా పకోడాలను తయారు చేసి పెట్టవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ మిక్డ్స్ వెజ్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ వెజ్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
కట్ చేసిన ఫ్రెంచ్ బీన్స్ – 5 లేదా 6, సన్నగా పొడవుగా తరిగిన క్యాప్సికం – 1, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – పెద్దవి రెండు, తరిగిన పచ్చిమిర్చి – 4, సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ – 1, పొడవుగా తరిగిన బంగాళాదుంప – 1, పొడవుగా తరిగిన క్యాబెజ్ – ఒక కప్పు, కారం – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మిక్స్డ్ వెజ్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కూరగాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ముందుగా నీళ్లు పోయకుండా పిండిని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ గట్టి పకోడీలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఈ ముక్కలను పకోడీలా వేసుకోవాలి. వీటిని ముందుగా 3 నుండి 4 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజ్ పకోడా తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.