Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Moong Dal Idli : ఎప్పుడూ తినే ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా ఇడ్లీల‌ను చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
November 18, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Moong Dal Idli : మ‌నం అల్పాహారంగా ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌రుచూ చేసే ఈ ఇడ్లీల‌ను మనం మ‌రింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఈ ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా పెస‌ర‌ప‌ప్పుతో ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మూంగ్ దాల్ ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

3 గంట‌ల పాటు నాన‌బెట్టిన పెస‌ర‌ప‌ప్పు – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – అర క‌ప్పు, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, వంట‌సోడా – అర టీ స్పూన్.

Moong Dal Idli recipe in telugu make in this method
Moong Dal Idli

మూంగ్ దాల్ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర‌ప‌ప్పును జార్ లో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ర‌వ్వ‌, పెరుగు, ఉప్పు, క్యారెట్ తురుము, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. పిండి మ‌రీ గట్టిగా ఉంటే త‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, క‌రివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. త‌రువాత ఈ తాళింపును పిండిలో వేసి క‌ల‌పాలి.

త‌రువాత వంటసోడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్ ల‌ల్లో వేసుకోవాలి. త‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ఇడ్లీ ప్లేట్ ల‌ను ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని బ‌య‌ట‌కు తీసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ప్లేట్ లో వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మూంగ్ దాల్ ఇడ్లీలు త‌యార‌వుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Moong Dal Idli
Previous Post

Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!

Next Post

Kobbari Ravva Laddu : కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇలా చేసి చూడండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.