OTT : శుక్రవారం వచ్చిందంటే చాలు.. థియేటర్లన్నీ సందడిగా మారుతుంటాయి. కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి కనుక ప్రేక్షకులు ఏ మూవీ చూడాలా.. అని ఆలోచిస్తుంటారు. ఇక ఓటీటీల్లోనూ ఈ మధ్య కాలంలో ఎంతో సందడి నెలకొంటోంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, సిరీస్‌లను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుదల చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లోనూ శుక్రవారం ప్రేక్షకులు భారీ ఎత్తున వాటిని వీక్షిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అజిత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ వలిమై ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. దీన్ని జీ5 యాప్‌లో వీక్షించవచ్చు. తమిళం, తెలుగు, కన్నడ, మళయాళంతోపాటు హిందీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా దీన్ని తెరకెక్కించారు.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు కీలకపాత్రల్లో నటించిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీని ముందుగా శుక్రవారమే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉండడం వల్ల ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేశారు. కనుక గురువారం నుంచే ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా యాప్‌లలో ఈ మూవీని వీక్షించవచ్చు.
కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన 83 మూవీ కూడా ఈ వారమే ఓటీటీల్లోకి వచ్చింది. దీన్ని హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడవచ్చు. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సూపర్ మచ్చి చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి చడీచప్పుడు ముందస్తు ప్రకటన లేకుండా ఈ మూవీని సైలెంట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.