Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Mudda Pappu Talimpu : ముద్ద ప‌ప్పును ఎప్పుడైనా తాళింపు పెట్టారా.. ఇలా చేసి తినండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..

D by D
January 7, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mudda Pappu Talimpu : మ‌నం త‌ర‌చుగా ముద్ద పప్పును త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ముద్ద పప్పులో నెయ్యి వేసి పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా పెడుతూ ఉంటారు. అలాగే ముద్ద ప‌ప్పు, అన్నం, ప‌చ్చ‌ళ్ల‌ను క‌లిపి తింటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ముద్ద ప‌ప్పును తాళింపు వేసి తిన‌వ‌చ్చు. తాళింపు వేసిన ఈ ముద్ద ప‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో క‌లిపి తింటే దీనిని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ముద్ద ప‌ప్పును తాళింపు ఎలా వేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముద్ద ప‌ప్పు తాళింపు త‌యారు చేయ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 150 గ్రా., చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఊర మిర‌ప‌కాయ‌లు – 5, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Mudda Pappu Talimpu recipe in telugu make in this style
Mudda Pappu Talimpu

ముద్ద ప‌ప్పు తాళింపు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిపప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అందులో ఒక గ్లాస్ నీళ్లు, ప‌సుపు, అర టీ స్పూన్ నూనె వేసి కుక్క‌ర్ మూత పెట్టాలి. త‌రువాత దీనిని 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత త‌గినంత ఉప్పును వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి, ఊర మిర‌ప‌కాయ‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముద్ద ప‌ప్పు తాళింపు త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Mudda Pappu Talimpu
Previous Post

Kama Kasturi : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ఈ మొక్క పెరుగుతుంది.. దీన్ని ఇంటికి తెచ్చుకోవ‌డం మ‌రిచిపోకండి..

Next Post

Chicken Curry : చికెన్ క‌ర్రీని ఒక్క‌సారి ఈ స్టైల్ లో చేయండి.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు..

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!