Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Mutton Kurma : మ‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
February 28, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mutton Kurma : మట‌న్ తో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌ట‌న్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ తో మ‌నం రుచితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, రోటీ, సంగ‌టి వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ మ‌ట‌న్ కుర్మాను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ మ‌ట‌న్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర‌కిలో, ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – 2 క‌ప్పులు, క‌సూరిమెంతి – అర టీ స్పూన్.

Mutton Kurma recipe make in this way very tasty with rice
Mutton Kurma

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – 2 ముక్క‌లు, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, పెద్ద యాల‌క్కాయ – 1, అనాస పువ్వు – 1, యాల‌కులు – 4, ల‌వంగాలు – 5, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – 4, ట‌మాట ముక్క‌లు – అర క‌ప్పు.

మ‌ట‌న్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా జార్ లో మ‌సాలా దినుసులు, జీడిప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఇది ఎర్ర‌గా వేగిన త‌రువాత మ‌సాలా పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. దీనిని 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు, ఉప్పు, కారం, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి.

త‌రువాత కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్లు పోసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ లేదా మ‌ట‌న్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్క‌ర్ ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి మ‌ర‌లా స్ట‌వ్ ఆన్ చేసి క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కుర్మా తయార‌వుతుంది. ఈ మ‌ట‌న్ కుర్మాను దేనితో తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Mutton Kurma
Previous Post

Chest Congestion Home Remedies : ఛాతి ప‌ట్టేసి ద‌గ్గు ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ 8 ఇంటి చిట్కాల‌ను పాటించండి..!

Next Post

Glass Of Milk Daily : రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే ఈ 10 అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Related Posts

business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.