Nayanthara : ప్రస్తుత తరుణంలో సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి కేరళలో వెకేషన్‌కు వెళ్లి వచ్చింది. ఇక తాజాగా తన స్నేహితురాలు నయనతారతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మంగళవారం ఫిబ్రవరి 22, 2022 ప్రత్యేకమైన నంబర్లు ఉన్న తేదీ కావడంతో సమంత, నయనతార ఇద్దరూ ప్రత్యేకంగా ఈ డేను జరుపుకున్నారు.
22.02.2022 ఈ నంబర్లను తిరగేసినా తిరిగి అలాగే చదవాలి. అందుకనే ఈ రోజును ప్రత్యేకమైన రోజుగా పిలుస్తారు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒకసారి ఇలాంటి నంబర్లను అనుభూతి చెందే రోజు వస్తుంది. ఇక ఈ రోజును టూస్ డే (Twosday)గా పిలుస్తున్నారు. కాగా ఇలా నంబర్లు వచ్చే విధానాన్ని సిమ్మట్రికల్ లేదా పాలిండ్రోమ్ అని అంటారు. కనుకనే ఈ రోజును నయనతార, సమంత ఇద్దరూ సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక వీరిద్దరూ కలసి నటించిన తాజా చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇందులో విజయ్ సేతుపతి మరో కీలకపాత్రలో నటించారు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మేకర్స్ తెలిపారు. దీనికి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార కన్మని పాత్రలో నటించగా.. సమంత ఖతిజా పాత్రను పోషించింది.