Nidhi Agarwal : యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు వరుస సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా.. ఒక్క హిట్ కూడా లభించడం లేదు. ఈ అమ్మడికి ఇతర హీరోయిన్లకు లేని ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ఈమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ఈమెకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కారణం.. ఈమె గ్లామర్ షో నే అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిధి అగర్వాల్ తాజాగా నలుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆ డ్రెస్‌లో అందాల విందు చేస్తూ ఒయ్యారాలను ఒలకబోసింది.
నిధి అగర్వాల్ గ్లామర్ షో చేయడంలో ఇతర హీరోయిన్ల కన్నా ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల ఈమె నటించిన హీరో సినిమా ఫ్లాప్ అయింది. నిధి అగర్వాల్ గ్లామర్‌ను ప్రదర్శించినా సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. అయితే ఈమె నటిస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ఏదో ఒక సినిమాలో ఆఫర్ వస్తుండడం.. ఈమె లక్ అనే చెప్పవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించనుంది. పవన్ హీరోగా తెరకెక్కనున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటించనుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపైనే ఈ అమ్మడు అన్ని హోప్స్ పెట్టుకుంది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టాన్ని ఇస్తుందో.. లేదో.. చూడాలి.