Oats Milk : మనం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఓట్స్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, విటమిన్ బి6, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చాలా మంది ఈ ఓట్స్ ను ఉప్మా లాగా లేదా పాలల్లో వేసి ఉడికించి పండ్ల ముక్కలు వేసుకుని తింటూ ఉంటారు. ఏ విధంగా తిన్నా కూడా ఈ ఓట్స్ చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే విధంగా ఓట్స్ ను తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్ ను ఏవిధంగా తీసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ ను తీసుకోవాలి. తరువాత అందులో దానిమ్మ గింజలను లేదా స్ట్రాబెర్రీ ముక్కలను వేసుకోవాలి. తరువాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును, అర కప్పు పాలను వేసి కలపాలి. తరువాత ఇందులో తేనె లేదా డేట్ సిరప్, మాపిల్ సిరప్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ ను రాత్రంతా అలాగే ఉంచాలి. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద లేదా ఫ్రిజ్ లో ఉంచి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ ను ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఇందులో పాలకు బదులుగా పెరుగును వేసుకోవచ్చు. ఈ విధంగా ఓట్స్ ను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఈ విధంగా ఓట్స్ ను తీసుకోవడం వల్ల తగినంత ఫైబర్ లభిస్తుంది. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, బరువు తగ్గడంలో కూడా ఓట్స్ మనకు దోహదపడతాయి. ఓట్స్ ను ఈ విధంగా తీసుకోవడం వల్ల పొట్టలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఓట్స్ ను రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఓట్స్ ను ఈ విధంగా రాత్రంతా నానబెట్టి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.