Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Pachi Batani Masala Curry : ప‌చ్చి బ‌ఠాణీల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. చ‌పాతీలు, పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

D by D
March 14, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pachi Batani Masala Curry : మ‌నం బ‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బ‌ఠాణీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌ఠాణీల‌ను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు మ‌నం బ‌ఠాణీల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌ఠాణీ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ‌ఠాణీల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి బ‌ఠాణీ – ఒక క‌ప్పు, త‌రిగిన బంగాళాదుంప – 1, గుండ్ర‌టి ముక్క‌లుగా త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 10, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్.

Pachi Batani Masala Curry recipe in telugu tasty with chapati and puri
Pachi Batani Masala Curry

బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో నువ్వులు, జీడిప‌ప్పు, కొబ్బ‌రి ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత ప‌చ్చి బ‌ఠాణీ, క్యారెట్, బంగాళాదుంప వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి కూర‌గాయ ముక్క‌ల‌ను మ‌గ్గించాలి. బ‌ఠాణీలు మ‌గ్గిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌ఠాణీ మ‌సాలా కర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా, పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వివిధ వంట‌కాల్లో వాడ‌డంతో పాటు బ‌ఠాణీల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Pachi Batani Masala Curry
Previous Post

Mango Ice Cream : పాలు, మామిడి పండ్లు వేసి ఎంతో రుచిక‌ర‌మైన చ‌ల్ల‌ని ఐస్ క్రీమ్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Next Post

Spicy Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా కారంగా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.