Papaya Smoothie : బొప్పాయి పండు.. ఇది మనందరికి తెలిసిందే. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా బొప్పాయి పండు మనకు సహాయపడుతుంది. ఈ బొప్పాయి పండుతో మనం ఎంతో రుచిగా ఉండే స్మూతీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్మూతీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తాగడం వల్ల బొప్పాయి పండు వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి పండు, చియా విత్తనాలు కలిపి రుచికరంగా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి చియా స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొప్పాయి పండు ముక్కలు – 250 గ్రా., ఐస్ క్యూబ్స్ – 7, బాదంపప్పు – 8, పెరుగు – అర కప్పు, తేనె – 3 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చియా విత్తనాలు – 2 టేబుల్ స్పూన్స్.
బొప్పాయి చియా స్మూతీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బొప్పాయి పండు ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఐస్ క్యూబ్స్, బాదంపప్పు, పెరుగు, తేనె వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ ఇందులో నానబెట్టిన చియా విత్తనాలు వేసి కలపాలి. పైన తరిగిన డ్రై ఫ్రూట్స్ ను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొప్పాయి చియా స్మూతీ తయారవుతుంది. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా బొప్పాయి పండుతో స్మూతీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.