Pragathi : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారు రోజూ చేసే పనులకు చెందిన విషయాలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఏ పని చేసినా దాని తాలూకు ఫొటోలు లేదా వీడియోలను వారు పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఇలాంటి వారిలో నటి ప్రగతి ముందే ఉంటారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ప్రగతి తాజాగా తన వర్కవుట్ వీడియోను పోస్ట్ చేసింది.
జిమ్‌లో నటి ప్రగతి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. ఫిట్ నెస్ విషయంలో ఈమె ఏమాత్రం రాజీ పడదు. అందులో భాగంగానే తరచూ జిమ్‌కు వెళ్తుంటుంది. అక్కడ అనేక వ్యాయామాలు చేస్తుంటుంది. వాటి వీడియోలను ప్రగతి పోస్ట్ చేస్తుంటుంది. ఇలా ఆమె ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ వర్కవుట్ చేసింది. ఆ వీడియోను షేర్ చేసింది.
View this post on Instagram
ప్రగతి వర్కవుట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. తన కుమార్తెతో కలిసి ఈమె ఎన్నో పాటలకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలను కూడా ఈమె తరచూ పోస్ట్ చేస్తుంటుంది. ఇక తాజాగా షేర్ చేసిన వీడియోలో ప్రగతి జిమ్‌లో తెగ కష్టపడుతుండడాన్ని గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.