Rashmika Mandanna : గత కొంత కాలంగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు మళ్లీ వచ్చాయి. బాలీవుడ్ మీడియాలోనూ ఈ వార్తలు హైలైట్ అయ్యాయి. దీంతో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇలాంటి వార్తలను ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని.. వివరణ ఇచ్చాడు.
అయితే తాజాగా రష్మిక మందన్న కూడా ఇదే విషయంపై స్పందించింది. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా మీడియాతో ముచ్చటించిన ఆమె తన పెళ్లి పుకార్లపై స్పందించింది. ఆ వార్తలను తాను ఎంజాయ్ చేశానని.. ఇలాంటివన్నీ సహజమేనని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఎన్ని వార్తలు రాసినా తనకు ఇబ్బంది లేదని.. ఎవరైనా సరే ఏమైనా రాసుకోండి.. అంటూ కుండబద్దలు కొట్టింది.
ఇక పెళ్లి చేసుకునేందుకు చాలా సమయం ఉందని.. విజయ్‌కు, తనకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలను తాను చాలా లైట్ తీసుకున్నానని రష్మిక మందన్న తెలియజేసింది. పెళ్లి అనేది ఒక వయస్సులో చేసుకోవాలని.. ఆ ఏజ్ ఇప్పుడు తనకు రాలేదని పేర్కొంది. సరైన సమయంలోనే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసింది.
కాగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ పలు చిత్రాల్లో నటించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో వీరు లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయారు. అలాగే ఇటీవలి కాలంలో వీరు ముంబైలో పలు మార్లు పార్టీల్లో కలసి ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని.. వీరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని.. వార్తలు వచ్చాయి. వీరిద్దరూ వేర్వేరుగా ఈ విషయంపై స్పందించడంతో.. ఆ వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం అయ్యాయి.