చాలా తక్కువ బడ్జెట్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే రియల్‌మి తాజాగా ఓ నూతన ట్యాబ్ ను లాంచ్ చేసింది. ఇది తక్కువ ధరకు లభించడమే కాదు, ఇందులో పలు ఆకట్టునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ మి కంపెనీ తాజాగా రియల్ మి ప్యాడ్ 2 లైట్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఇందులో 10.5 ఇంచుల 2కె ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
ఈ డిస్ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల కళ్లకు రక్షణ ఉంటుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ హీలియో జి99 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు. అలాగే మరో 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్ 4జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ రెండు వేరియెంట్లలో లాంచ్ అయింది. అయితే రెండింటిలోనూ 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఈ ట్యాబ్‌లో మనకు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది.
ఈ ట్యాబ్‌లో వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ట్యాబ్‌తో తీసే వీడియోలు క్వాలిటీగా వస్తాయి. అలాగే ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కి ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి పోర్టు ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. దీంట్లో మనకు 8300 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కనుక ఈ ట్యాబ్ వేగంగా చార్జ్ అవడమే కాదు, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా వస్తుందని చెప్పవచ్చు.
ఇక రియల్‌మి ప్యాడ్ 2 లైట్ ట్యాబ్ స్పేస్ గ్రే, నెబులా పర్పుల్ రంగుల్లో రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఈ ట్యాబ్ త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులోకి రానుంది.