Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Royyala Vepudu : రొయ్య‌ల వేపుడు త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
April 29, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Royyala Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల వేపుడు కూడా ఒక‌టి. రొయ్య‌ల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా చేసే రొయ్య‌ల వేపుడు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, అంద‌రికి న‌చ్చేలా రొయ్య‌ల వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్య‌ల వేపుడు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

రొయ్య‌లు – అర‌కిలో, నిమ్మ‌ర‌సం -అర చెక్క‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి- 3, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Royyala Vepudu recipe in telugu make in this method
Royyala Vepudu

రొయ్య‌ల వేపుడు త‌యారీ విధానం..

ముందుగా శుభ్రం చేసిన రొయ్య‌ల్లో నిమ్మ‌ర‌సం, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి అర‌గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక రొయ్య‌ల‌ను వేసి వేయించాలి. వీటిని నీరంతా పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత వేయించిన రొయ్య‌లు, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు బాగా వేయించాలి.

రొయ్య‌లు వేగుతుండ‌గానే జార్ లో ధ‌నియాలు, మిరియాలు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పొడిని రొయ్య‌ల‌ల్లో వేసి క‌ల‌పాలి. అలాగే క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల వేపుడు త‌యార‌వుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి. అ్నంతో కూడా ఈ రొయ్య‌ల వేపుడును తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన రొయ్య‌ల వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Royyala Vepudu
Previous Post

Vitamin D : విట‌మిన్ డి ల‌భించాలంటే.. అస‌లు వేటిని తినాలి..?

Next Post

Coconut Milk Pulao : కొబ్బ‌రిపాల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.