RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ చేదు వార్త చెప్పనున్నారా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. జనవరి 7వ తేదీన ఈ మూవీ విడుదల కావల్సి ఉండగా.. ఈ సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీకి గాను ఇటీవలి కాలంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ముంబై, చెన్నై నగరాల్లో ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా నిర్వహించారు. అయితే ఈ మూవీ విడుదలను వాయిదా వేసి ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ 1, 2022వ తేదీన విడుదలవుతుందని సమాచారం. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నందున అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. తమిళనాడు, ఢిల్లీల్లో థియేటర్లపై పెద్ద ఎత్తున ఆంక్షలను విధించారు. ఇలాంటి పరిస్థితులలో సినిమాను విడుదల చేయడం కష్టం కనుక.. చేసినా వసూళ్లు రాబట్టడం కష్టం కాబట్టి.. సినిమా విడుదలను వాయిదా వేయాలనే మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఈ మూవీ అసలే పాన్ ఇండియా మూవీ కనుక థియేటర్లు పూర్తి స్థాయిలో నడవకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుకనే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలను వాయిదా వేస్తారని తెలుస్తోంది.
ఇక శనివారం ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మూవీని విడుదల చేస్తారా, లేదా.. అన్నది శనివారం తేలిపోనుంది.