Salt And Mustard For Dishti : నేటి తరుణంలో అనేక మంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. అలాగే కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, అనుకున్న పనులు నేరవేరకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడమే. అలాగే నరదిష్టి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. నరదిష్టి కారణంగా తలెత్తే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మనం నరదిష్టిని అలాగే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ నుండి మనం బయట పడవచ్చు. నరదిష్టి మన మీద పడకుండా ఉండాలంటే ఇంటి ముందుగ బూడిద గుమ్మడికాయను కట్టుకోవాలి.
గుమ్మడికాయను కట్టుకోవడం వల్ల దృష్టి ఎక్కువగా గుమ్మడికాయ మీద పడుతుంది. గుమ్మడికాయ లేకపోవడం వల్ల అందరి దృష్టి నేరుగా ఇంటి మీద, ఇంట్లో ఉండే వ్యక్తుల మీద పడుతుంది. కనుక గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవాలి. అలాగే వ్యాపారం చేసే దగ్గర కూడా ఈ గుమ్మడి కాయను కట్టుకోవడం ఉత్తమం. అలాగే చాలా మంది బయట తిరిగి వచ్చి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి నేరుగా వచ్చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక ఎక్కడ తిరిగి వచ్చిన ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కుని వెళ్లాలి.
ఇలా చయడం వల్ల హానికారక బ్యాక్టీరియా కూడా ఇంట్లోకి వెళ్లకుండా ఉంటుంది. అదే విధంగా నరదిష్టి, నెగెటివ్ ఎనర్జీతో బాధపడే వారు ఒక చిన్న చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును, పసుపును, తెల్ల ఆవాలను తీసుకోవాలి. తెల్ల ఆవాలు అందుబాటులో లేని వారు నల్ల ఆవాలను కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఒక గిన్నెలో వీటిని తీసుకుని చేత్తో పట్టుకుని నరదిష్టి తొలగిపోవాలని మనసులో అనుకుంటూ ఇల్లంతా ప్రతి మూల తిరగాలి. తరువాత దానిని ఎవరి కంట పడకుండా ఒక మూలన ఉంచాలి. ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం తీయకుండా ఇంటి వెనుక ద్వారాన్ని తీయాలి. ఆ తరువాత ఇంటి ప్రధాన ద్వారాన్ని తీయాలి.
ఇలా చేయడం వల్ల జేష్టా దేవి ఇంటి వెనుక ద్వారం నుండి వెళ్లిపోయి లక్ష్మీ దేవి ఇంటి ప్రధాన ద్వారం నుండి వస్తుంది. అలాగే ఇంట్లో ఉంచిన ఈ ఆవాలను ప్రవహించే నీటిలో వదలాలి. ప్రవహించే నీరు అందుబాటులో లేని వారు ఇంటి బయట ఉండే సింక్ లో వీటిని వేసి నీటిని వదలాలి. ఇంట్లో ఉండే సింక్ లో మాత్రం వీటిని వేయకూడదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ప్రశాంతత లేని వారు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వారు, వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్న వారు ఇలా చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.