Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతపై ఎంతో మంది దుమ్మెత్తి పోశారు. అన్నింటికీ ఆమే కారణం అని ఆమెను విమర్శించారు. ఓ దశలో ఆమె తీవ్ర మనస్థాపం చెంది కొన్ని యూట్యూబ్ చానల్స్‌పై పరువు నష్టం కేసు కూడా వేసింది. అయితే ఇప్పుడు ఆమె స్వేచ్ఛా జీవి. అనుకున్నది చేయవచ్చు. కానీ విడాకుల అనంతరం ఆమె పరువు పోయిందని, ఆమె పేరు పోగొట్టుకుందని.. ఇప్పుడు సమంతకు అంత పాపులారిటీ లేదని చాలా మంది అన్నారు. కానీ అది తప్పని.. ఇప్పటికీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందని అర్థమైంది.
తాజాగా సమంత నల్గొండలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైంది. అక్కడ ఆమెకు అశేష ప్రేక్షక వాహిని స్వాగతం పలికింది. ఆమెను చూసేందుకు ఎంతో మంది అభిమానులు వచ్చారు. విడాకులు తీసుకున్న తరువాత కూడా సమంత పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే.
నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక సమంత పేరు పోతుందని.. అసలు ఆమెకు అవకాశాలు రావని అన్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడే ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఆమె పాపులారిటీ కూడా తగ్గుతుందని అన్నారు. కానీ అది ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. అయితే దీన్ని ఆమె ఎంతకాలం నిలుపుకుంటుంది ? అన్నది సందేహంగా మారింది. మరి సమంత ఎప్పటికీ ఇలాగే ఉంటుందా ? ఆమె పాపులారిటీ ఎంతకాలం ఉంటుంది ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.