Akshay : అక్కినేని నాగార్జున, కె.దశరథ్ ల కాంబినేషన్లో వచ్చిన మూవీ.. సంతోషం. ఈ మూవీ ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టీవీల్లో ఈ చిత్రం వచ్చినప్పుడల్లా ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఈ మూవీకి మంచి టీఆర్పీ రేటింగ్స్ కూడా వస్తుంటాయి. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీలో అక్కినేని నాగార్జునకు జోడీగా గ్రేసీ సింగ్ నటించగా.. శ్రియ మరో కీలకపాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎమోషన్లతో సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలోని ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఇక ఇందులో నాగార్జునకు కొడుకుగా నటించిన బాలుడు కూడా అందరికీ తెలుసు. బొద్దుగా ఉండేవాడు. క్యూట్‌గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డైలాగ్స్ చెప్పాడు. అయితే ఆ బాలుడి పేరు.. అక్షయ్ బచ్చు. అక్షయ్ హిందీలో పలు మూవీల్లో నటించాడు. అదే సమయంలో అక్షయ్ యాక్టింగ్ చూసిన నాగార్జున తన సినిమాలో తన కొడుకుగా నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఇక సంతోషం మూవీలోనూ అక్షయ్ నటించి అలరించాడు.
సంతోషం మూవీ అనంతరం తెలుగులో ప్రభాస్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన వర్షం మూవీలోనూ నటించాడు. అయితే కొంతకాలం పాటు విద్యాభ్యాసం కొనసాగించిన అక్షయ్ తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు. కానీ హిందీలో మాత్రం పలు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇతను బాలీవుడ్లోనే సెటిల్ అయ్యాడు. ఇప్పటికే 12 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఇతను 45కి పైగా యాడ్స్‌లోనూ నటించాడు. ఈ క్రమంలోనే ఇతనికి సోషల్ మీడియాలో సైతం ఫాలోవర్లు ఎక్కువగానే ఉన్నారు.