Snake In Sleep : మనకు రోజూ అనేక రకాల కలలు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని కలలు మనల్ని భయపెడుతుంటాయి. కొన్ని కలలు మనకు రోజూ నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు చెందినవి అయి ఉంటాయి. అయితే కలలో కొన్ని సార్లు వివిధ రకాలు జంతువులు, జీవులు కనిపిస్తుంటాయి. వాటిల్లో పాము ఒకటి. కలలో పాము కనిపిస్తే కీడు జరుగుతుందని కొందరు భావిస్తారు. కానీ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం ఇది అన్ని సందర్భాల్లోనూ జరగదు. ఈ క్రమంలోనే కలలో పాములు కనిపిస్తే ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో ఒకే ఒక పాము సింగిల్‌గా కనిపిస్తే మీకు నాగ దోషం తొలగిపోయిందని అర్థం. అలాగే పాము మిమ్మల్ని వెంబడించినట్లు కల వస్తే మీకు త్వరలో ఏదో కీడు జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అయితే పాము కరచి రక్తం వచ్చినట్లు కల వస్తే మాత్రం అది ఆకస్మిక ధనలాభానికి సూచన అట. కనుక ఇలా కల వస్తే భయపడాల్సిన పనిలేదు.
ఇక జంట పాములు కలలో కనిపిస్తే అరిష్టం. దీనికి తప్పక పరిహారం చేయించుకోవాలి. అలాగే పాము మీ గుండెలపై ఉన్నట్లు కల వచ్చినా.. మిమ్మల్ని కాటు వేసినట్లు కల వచ్చినా.. మీకు నాగదోషం త్వరలో తొలగిపోతుందని అర్థం. ఇలా కలలో పాము కనిపించిన విధానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అంతేకానీ.. కలలో పాము కనిపించిందని భయపడాల్సిన పనిలేదు.
ఇక కలలో శేషతల్పంపై ఉండే శ్రీమహావిష్ణువు కనిపిస్తే.. అలాంటి వ్యక్తులకు అంతులేని సంపద రాబోతుందని అర్థం. వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఇలా శాస్త్రాలను అర్థం చేసుకోవాలి. అయితే కలలో పాము కనిపిస్తే.. ఒకసారి పండితులను అడిగి దాని ప్రకారం ఏవైనా పరిహారం ఉంటే చేయించుకుంటే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.