Sourav Ganguly : అల్లు అర్జున్, రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. పుష్ప. భారతీయ చలన చిత్ర బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపింది. కేవలం హిందీలోనే ఈ మూవీ రూ.100 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ విడుదలై ఇప్పటికే 100 రోజులు దగ్గర పడుతోంది. అయినప్పటికీ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికే చాలా మంది ఈ మూవీలోని డైలాగ్స్‌ను చెబుతూ.. పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి భారత జట్టు మాజీ క్రికెట్ ప్లేయర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరిపోయారు.
పుష్పలోని శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ చాలా ఫేమస్ అయింది. అలాగే అందులో ఆయన చెప్పిన తగ్గేదేలే.. డైలాగ్ కూడా చాలా పాపులర్ అయింది. ఇక ఈ రెండింటినీ గంగూలీ చేసి చూపించారు. ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న రియాలిటీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌరవ్ గంగూలీ పుష్పలోని శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. అలాగే తగ్గేదేలే.. అని డైలాగ్ చెప్పారు. దీంతో ఆయన చేసిన ఈ ఫీట్స్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#BCCI President Sourav Ganguly does #AlluArjun???? Srivalli Step From Pushpa on the Sets of Dadagiri Unlimited ! #PushpaTheRule
Video Courtesy: Zee Bangla pic.twitter.com/BIvYJzwTEG— Debayan Bhattacharyya (@Debayan9696) March 23, 2022
కాగా గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో బిజీగా ఉన్నారు. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. తొలి రోజు మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.